నవతెలంగాణ-కాగజ్‌నగర్
కాగజ్‌నగర్ పట్టణం సర్‌సిల్క్‌లోని గంగారాంబస్తీకి చెందిన తాండ్ర కొమురమ్మ (58) శుక్రవారం మధ్యాహ్నం ఇంటి గోడ కూలి మృతి చెందింది. స్థానికులు తెలిపిన ప్రకారం వరుసగా కురుస్తున వర్షాల కారణంగా కొమురమ్మ ఇంటికి సంబంధించిన ఇటుక గోడ పూర్తిగా తడిసి శిథిలావస్థకు చేరుకుంది. మధ్యాహ్నం సమయంలో కొమురమ్మ గోడ పక్కనే ఉండగా, ఒకేసారి కూలి ఆమెపై పడింది. దీనితో కొమురమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మహిళకు భర్త లేడు. ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉండగా, వారు పనుల రీత్యా వివిధ ప్రాంతాలలో ఉంటున్నారు. ఇంట్లో ఒక్కతే ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.