నవతెలంగాణ – వనపర్తి రూరల్
బస్సు ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణిస్తున్న మహిళ ప్రమాదవశాత్తు కింద పడి మహిళ మృతిచెందింది. ఈ ఘటన వనపర్తిలో జరిగింది. ఎస్‌ఐ జయన్న తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తిలోని ఇందిరా కాలనీకి చెందిన గోవిందమ్మ(50) ఏదుట్ల గ్రామానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది. ఫుట్‌బోర్డుపై నిలబడటంతో ప్రమాదవశత్తు కిందపడింది. దీంతో కాళ్లపై నుంచి బస్సు టైర్లు వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి మృతిచెందింది. ఈ మేరకే కేసు దర్యాప్తులో ఉంది.