కుటుంబ సభ్యులతో గొడవపడిన మహిళ మద్యం మత్తులో గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది.ఈ సంఘటన మండల పరిధిలోని అప్పనపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం గ్యార మంగవ్వ (66)కు మద్యం సేవించే అలవాటు ఉంది.గత నెల 22న అదే గ్రామానికి చెందిన భూలక్ష్మి మృతి చెందగా మూడు రోజుల పిట్టకు పెట్టె కార్యక్రమానికి తన భర్త తో కలిసి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చింది. ఐతే అదే రోజు సాయంత్రం మద్యం సేవించి భర్త తో గొడవపడగా భర్త సర్థిచెప్పి పనిమీద ఊళ్లోకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్ళాడు.ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో మంగవ్వ గడ్డి మందు తాగానని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. విషయం తెలుసుకున్న భర్త హుటాహుటిన ఇంటికి చేరుకుని సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని మెడికర్ హాస్పిటల్ కి తరలించాలని రిఫర్ చేయగా సోమవారం తెల్లవారుజామున 12 గంటల 8 నిమిషాలకు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.గత 6నెలల క్రితం మద్యం మత్తులో తాను చనిపోతానని బావి దగ్గరకు పరుగెత్తిందని, తాగిన మైకంలో మతిస్థిమ్మితం లేక గడ్డి మందు తాగి చనిపోయిందని మృతురాలి భర్త మైసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.