కారు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు

నవతెలంగాణ – శంకరపట్నం
కారు ఢీకొని మహిళకు తీవ్రంగా గాయాలైన సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే శంకరపట్నం మండల పరిధిలోని కొత్తగట్టు, గ్రామానికి చెందిన పల్లె రజిత (50 ) శుక్రవారం తన వ్యవసాయ పనుల నిమిత్తం భావి వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా, రోడ్డు ప్రక్కన తన భర్త మహేందర్ రెడ్డి కోసం నిలబడి ఉండగా కరీంనగర్ నుండి హుజురాబాద్ కు వెళ్లే కారు ఢీకొట్టడంతో రజిత తలకు బలమైన గాయమైంది. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ ఉన్న స్థానికులు చూసి 108 ఫోన్ చేయడంతో సిబ్బంది ఈఎంటి సతీష్ రెడ్డి, పైలెట్ గోపికృష్ణ, లు సంఘటన స్థలానికి చేరుకొని, అపస్మారక స్థితిలో ఉన్న రజితను అంబులెన్స్ లోకి తీసుకొని ప్రథమ చికిత్స అందిస్తూ హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు.