మహిళ అబల కాదు సబల

 

– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సైదులు
నవతెలంగాణ హలియా: మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ విజయపదంలో దూసుకెళ్తున్నారని మహిళా అబల కాదు సభలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు అన్నారు. హాలియాలో మూడో వార్డులో సీఐటీయూ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలపై తాడులో దౌర్జన్యాలు అకృత్యాలు పెరిగితంగా పెరుగుతున్నాయని వాటిని అరకట్టడంలో సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బాధ్యత అని అన్నారు. మహిళలని గౌరవించే అభివృద్ధి పరిచిన చోటనే సమాజాభివృద్ధి జరుగుతుందన్నారు. స్ర్తీ లేనిదే సమాజం లేదని అన్ని రంగాల్లో రాణించాలని రాజకీయ చైతన్యం కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. మహిళలు ఇందు గలరు అందు లేరని సందేహం లేదు ఎందెందు చూసినా అందందే మహిళలు ఉన్నారని అన్నారు. రంగవల్లిలను ప్రోత్సహించి సహకరించిన దాతలు మంద నర్సిరెడ్డి, సైదులు, దేవనబోయిన రాజేష్, గడ్డం రమణయ్య, సాంబయ్య ఎక్కలూరి శ్రీనివాసరెడ్డికి, ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి, నాయకులు రేబిల్లి వెంకటేశ్వర్లు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ కారంపూడి ధనమ్మ, పొదిల, వెంకన్న రెడ్డి, మల్ల సురేష్ కాట్నం ఎంకన్న, తదితరులున్నారు.