నవతెలంగాణ- శంకరపట్నం : కోతి అడ్డు రావడంతో మహిళకు తీవ్ర గాయాలై న ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి గ్రామానికి చెందిన, నరెడ్ల సారిక (32) తన భర్త రమేష్ తో, కలిసి బైక్ మీద వెళుతుండగా కేశవపట్నం హైవే ఆర్ఎంపి భవన్ దగ్గర కోతి అడ్డు రావడంతో బైకు అదుపుతప్పి కింద పడడంతో బైక్ పై వెళుతున్న మహిళ కిందపడడంతో తలకు కాళ్లకు తీవ్రగాయాలు కాగా భర్త రమేష్ 108 కి ఫోన్ చేయడంతో సిబ్బంది ఈఎంటి సతీష్ రెడ్డి, పైలెట్ కాజా ఖలీల్ఉల్లాలు సంఘటన స్థలానికి చేరుకొని బాధితురాలి కి ప్రథమ చికిత్స అందిస్తూ, హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కు తరలించినట్లు, అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.