– ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్
అస్టానా(కజకిస్తాన్): ఆసియా మహిళల టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో మనిక బత్రా, ఐహికా, సుతీర్థ ముఖర్జీలతో కూడిన భారత టిటి జట్టు చరిత్ర సృష్టించింది. భారత్‌కు కాంస్య పతకాన్ని ఖాయం చేసి భారత మహిళల టిటి జట్టు ఈ ఫీట్‌ను సాధించింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 1-3తేడాతో జపాన్ చేతిలో ఓటమిపాలైంది. మరో మ్యాచ్‌లో చైనా 3-0తో హాంకాంగ్‌ను చిత్తుచేసింది. సెమీస్‌లో ఓడిన ఇరుజట్లకు కాంస్య పతకాలు దక్కనున్నాయి. ఈ టోర్నీ చరిత్రలో భారత్‌కు ఓ పతకంకు దక్కడం ఇదే తొలిసారి. సెమీస్ తొలి సింగిల్స్‌లో ఐహిక 2-3 (8-11, 11-9, 8-11, 13-11, 7-11)తో మివా హరిమ్ చేతిలో ఓడింది. రెండో సింగ్స్‌లో సుతీర్థ 3-0 (11-9, 11-4, 15-13) ఓడింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మనిక బత్రా 3-1 (11-3, 6-11, 11-2, 11-3)తో ఓటమిపాలైంది. ఇక భారత పురుషుల జట్టు క్వార్టర్ఫైనల్లో కజకిస్తాన్‌తో తలపడనుంది.