సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ – పద్మాలయా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా బేబీ డమరి సమర్పణలో నిర్మించిన సౌత్ ఇండియా చిత్రం ‘ఎర్ర చీర’. ఇటీవల షూటింగ్‌తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని నవంబర్ 9న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఇందులో కళ్లు చెదిరేలా 36 నిమిషాల గ్రాఫిక్స్, లక్షలాది మంది అఘోరాలతో క్లైమాక్స్‌తో కూడిన మదర్ సెంటిమెంట్, హర్రర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో మంచి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించామని నిర్మాతల్లో ఒకరైన ఎన్వీవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీపావళి కానుకగా నవంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని దర్శకుడు, నటుడు అయిన సుమన్ బాబు తెలిపారు.
ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో శ్రీరామ్, అయ్యప్ప పీ శర్మ, సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు సాయి తేజస్విని, కారుణ్య చౌదరి, కమల్ కామరాజు, సుమన్ బాబు, అజరు, అలీ, రఘుబాబు, గీతాసింగ్, జీవ, భద్రం, సురేష్ కొండేటి, అన్నపూర్ణమ్మ, సత్య కష్ణ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు- గోపి విమల పుత్ర, సంగీతం- ప్రమోద్ పులిగిల్ల, నిర్మాతలు-సుమన్ బాబు, ఎన్‌వివి. సుబ్బారెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుమన్ బాబు.