
జవహర్ నవోదయ విద్యాలయం, చలకుర్తి క్యాంప్ నల్గొండ జిల్లాలో జరుగుతున్న స్వాతంర్య దినోత్సవాలలో భాగంగా ఆదివారం స్పీక్ మైకే ద్వారా ముగ్గురు అంతర్జాతీయ కళాకారులచే అద్భుతమైన సంగీత ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అందులో శ్రీనివాస్ సంగీతంలో విద్వాన్ న్యూఢిల్లీలోని సంగీత నాటక అకాడమీ ద్వారా నిశ్నాతులు. వారి ఉద్యోగ జీవితాన్ని 9 సంవత్సరాల వయసులోనే ప్రారంభించారు. వారికి మొదటి బహుమానం ఆల్ ఇండియా రేడియో ద్వారా 1989వ సంవత్సరంలోనే రావడం విశషం. వారితోపాటు చంద్రకాంత్ మృదంగాన్ని వాయింయించి అందరి హృదయాలలో మంచి స్థానాన్ని సంపాదించారు. అంతేకాకుండా శ్రీ బి . పవన్ సింగ్ వయోలిన్ లో విద్వాంసులు. వీరు ముగ్గురు అతిరథ మహారధులు నవోదయ విద్యాలయానికి వచ్చి విద్యార్థులను సంగీతము పట్ల ఆకర్షితులను చేయడం విశేషం.ఈ అవకాశం సమితి ద్వారా లభించడం నిజంగా చలకుర్తి నవోదయ విద్యాలయ విద్యార్థిని విద్యార్థులు చేసుకున్న పూర్వజన్మ పుణ్యమని చెప్పవచ్చును. వీరికి అవసరమయ్యే అన్ని రకాల అద్భుతమైన ఏర్పాట్లను ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ఈ సందర్భంగా విద్యాలయ ఉప ప్రధానచార్యులు స్వర్ణలత గారు మాట్లాడుతూ విద్యార్థులు చదువులో రాణించాలంటే సంగీతము ,ఆర్ట్,ఆటలు మొదలైన వాటిలో చురుకుగా పాల్గొని ఏదో ఒక దాంట్లో ప్రావీణ్యము సంపాదించినప్పుడే అది సాధ్యమని ఉన్నతమైన శిఖరాలకు చేరుకుంటారని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.