నవతెలంగాణ-సారంగాపూర్: మద్యం మత్తులో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్వర్ణ గ్రామానికి చెందిన రాజుల సాయి( 35) వివాహం అయ్యింది, కాని తన భార్య నాలుగు సంవత్సరాల క్రితం అతనిని విధిచి వెళ్ళి పొగా తల్లి భోజవ్వ తో ఉంటున్నారు భార్య లేకపోవడంతో మనస్తాపానికి గురై తాగుడికి బానిసై మంగళవారం రాత్రి తాగిన మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు వెంటనే నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.