నవతెలంగాణ – కంటేశ్వర్
మద్యానికి బానిసై రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు. ఈ ఘటన నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని చంద్రశేఖర్ కాలానికి చెందిన మహమ్మద్ షకీల్(30) మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. వృతి రీత్యా లారి డ్రైవర్ గా విధులు చేసేవాడని, వచ్చిన డబ్బుతో మద్యానికి బానిసై తరుచుగా మద్యం సేవించేవాడని తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం మద్యం సేవించి ఇంటికి రాగా తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో నుంచి వెళ్లి మాధవ్ నగర్ దగ్గర గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలియజేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.