ఉద్యోగం రాలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

• ప్రభుత్వోద్యోగానికి నిరిక్షించి..ఉరేసుకుని..

• గుగ్గీళ్లలో యువకుడి బలవనర్మణం..
• దుర్వాసన వేదజల్లడంతో ఆలస్యంగా వెలుగులోకి..
నవతెలంగాణ-బెజ్జంకి 
యువకుడు ఉన్నతమైన విద్యను అభ్యసించాడు. ప్రభుత్వోద్యోగం కోసం పరితపించి నిరిక్షించాడు. ప్రభుత్వం విడుదల చేసిన అర్హతగల ఉద్యోగ పరీక్షలకు హజరయ్యాడు. ఏ ఒక్క ప్రభుత్వోద్యోగం వరించకపోవడంతో యువకుడు ఇంట్లో ఉరేసుకుని బలవనర్మణానికి పాల్పడ్డాడనే అభిప్రాయాలు గ్రామ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.యవకుడి మృతదేహం దుర్వాసన వెదజల్లడంతో స్థానికులు గమనించిన సంఘటన మండల పరిధిలోని గుగ్గీళ్ల గ్రామంలో గురువారం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం సోము శంకర్(35) ఉన్నతమైన విద్యనభ్యసించాడు.గత కొద్దేండ్లుగా ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు.ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ ఉద్యోగం వరించలేదు.తల్లిదండ్రులు గత కొద్దేండ్ల క్రితమే కాలం మృతి చెందారు.ఇంట్లో ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు.గత రెండు రోజుల క్రితమే యువకుడు ఇంట్లో ఉరేసుకుని బలవనర్మణానికి పాల్పడి ఉండవచ్చునని.. మృతదేహం దుర్వాసన వెదజల్లడంతో గమనించామని స్థానికులు తెలిపారు. మృతుని అన్న సోము రమేశ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నాడని స్థానికులు తెలిపారు.ఉన్నతమైన విద్యనభ్యసించి ప్రభుత్వోద్యోగం కోసం నిరిక్షించి యువకుడు బలవనర్మణానికి పాల్పడిన హృదయవికార ఘటన గ్రామస్తులను కలిచివేసింది.మృతుని అన్న పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టామని హెడ్ కానిస్టేబుల్ కనుకయ్య తెలిపారు.