చెట్టుకు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య     

నవతెలంగాణ – నవాబ్ పేట
మండల పరిధిలోని గురుకుంట గ్రామానికి చెందిన బీఆరెస్ పార్టీ నాయకులు ప్రతాప్ మేనల్లుడు మధు (38) గురుకుంట శివారులో  వ్యవసాయ పొలానికి వెళ్లి  ఓ చింత చెట్టుకు ఉరేసుకుని చనిపోయిన సంఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.సంఘటనకు సంబంధించిన వివరాలు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మధు గత కొన్ని రోజులుగా కుటుంబ, ఆరోగ్యం పట్ల మానసిక ఒత్తిడే ఉండొచ్చని భావిస్తున్నారు.మధు చిన్న నాటి నుండే మేనమామ ప్రతాప్ దగ్గర ఉండేవాడు.సంఘటనకు సంబంధించి మధు తల్లి పద్మమ్మ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు.