చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య…

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం కూనేపల్లి గ్రామానికి చెందిన సుద్ధ సతీష్(25) అనే యువకుడు స్థానిక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని హెడ్ కానిస్టేబుల్ సునీత తెలిపారు. మృతుడికి ఇటీవలే పాప జన్మించడంతో ఇంట్లో శుభకార్యం జరగడం తో మృతుడు మద్యం విపరీతంగా సేవించడంతో కుటుంబీకులు ఆయనను మందలించగా మద్యం మత్తులో ఉన్న యువకుడు స్థానిక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆమె తెలిపారు. భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్ట్ మాత్రం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.