బావిలో దూకి యువకుడు ఆత్మహత్య 

నవతెలంగాణ – కొనరావుపేట
కుటుంబ కలహాలతో తో మద్యానికి బానిసై బావిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన పల్లి శ్రీకాంత్ గౌడ్ (31) స్థానికంగా కులవృత్తితో పాటు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. శ్రీకాంత్ కు 8 సంవత్సరాల క్రితం మధూషా తో వివాహం అయింది.అప్పటి నుండీ మధుషా ఫిట్స్ తో బాధపడుతుండగా శ్రీకాంత్ పలు హాస్పిటల్లలో  చూపించిన నయం కాకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. నెల క్రితం శ్రీకాంత్ భార్యకు ఫిట్స్ రావడంతో తనను హాస్పిటల్లో చూపించడంలేదని పిల్లలతో కలిసి తల్లిగారింటికి వెళ్ళింది. దీంతో మరింత మద్యానికి బానిసైనా శ్రీకాంత్ మంగళవారం కోనరావుపేటకు వెళ్లి ఉదయం బస్టాండ్ లో బస్సు కిందకు వెళ్లడంతో బస్ డ్రైవర్ గమనించి ఆపి అక్కడి నుండి పంపించారు. శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకోవాలని ఉద్దేశంతో గ్రామ శివారులోని రోడ్డు పక్కన గల రాసా నారాయణరెడ్డి కి చెందిన బావిలో  దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు, పొలీసులకు సమాచారం అందించడంతో  చేరుకొని అప్పటికే శ్రీకాంత్ నీటిలో మునిగిపోయాడు. పోలీసులు ఈతగాళ్ళ  సహాయంతో   డెడ్ బాడీని బయటకు తీశారు.మృతుని తల్లి లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మృతునికి భార్య మధుష, కుమారుడు రిష్విక్, కూతురు శన్విక లు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు పలువురు నాయకులు కోరారు.