గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

నవతెలంగాణ-భిక్కనూర్
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మరణించిన సంఘటన మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ శివారులో 44వ జాతీయ రహదారి పై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భిక్నూర్‌ పట్టణానికి చెందిన గంగల శంకర్ (28) సోమవారం సాయంత్రం దాబా హోటల్ లో భోజనం చేసి వస్తానని కుటుంబికులకు చెప్పి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. సోమవారం సాయంత్రం శంకర్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడ మరణించాడు. మంగళవారం ఉదయం స్థానికులు గమనించి కుటుంబీకులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్ తరలించి, కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆనంద్ గౌడ్ తెలిపారు.