మండలంలోని పడం పల్లి గ్రామానికి చెందిన నా గొండ కు గుర్తుతెలియని వాహనము ఢీకొని మృత్యువాత పడిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబీకులు జుక్కల్ ఎస్సై తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని పడం పల్లి గ్రామానికి చెందిన నాగోండ వయస్సు 36 సంవత్సరాలు వృత్తి వ్యవసాయం చేస్తూ జీవనం గడిపేవాడు. గురువారం నాడు సాయంత్రం భార్య చికెన్ తీసుకురావాలని భర్తను కోరడంతో భార్య కోరిక మేరకు వాహనంపై పెద్ద ఎడికి గ్రామానికి బయలుదేరుతున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. దారి నుండి వెళ్తున్న కొంతమంది వ్యక్తులు పడంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో గుర్తించి గ్రామానికి చెందిన వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు అక్కడికి వెళ్లడంతో గుర్తించి కుటుంబీకులకు జుక్కల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు స్పాట్కు వచ్చి విచారణ చేపట్టి మృతదేహాన్ని పి యం కు పంపించడం జరిగింది భార్య గంగమని ఫిర్యాదు మహిళకు దర్యాప్తు కొనసాగిస్తున్నామని జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ తెలిపారు.