పురుగుల మందు తాగి యువకుడు మృతి

నవతెలంగాణ – దంతాలపల్లి
మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన  గురువారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బొడ్లాడ గ్రామానికి చెందిన కట్ల వంశీ (19) అనే యువకుడు కూలీనాలీ చేస్తూ జీవనం కొనసాగించేవాడు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఈనెల 21న సాయంత్రం గడ్డి మందును తీసుక వచ్చి తాగుతుండగా తల్లి చూసి తొర్రూర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.