మండలంలోని దొంగతుర్తి గ్రామానికి చెందిన కూనారపు లక్ష్మణ్ (36) గత కొన్ని సంవత్సరాల నుండి మద్యం తాగుడుకు బానిసై తాగిన మత్తులో ఈనెల 19 గురువారం రోజున సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. అదే క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడని మృతుని భార్య కూనారపు నర్సవ్వ తెలిపింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శీలం లక్ష్మణ్ తెలిపారు. మృతుడికి ఒక చిన్న బాలుడు కుమారుడు ఉన్నాడు.