– నాలుగు రోజులకు వెలుగులోకి
నవతెలంగాణ – చందుర్తి
బైక్ అదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని మూడపల్లి శివారు లో చోటు చేసుకుంది.స్థానిక సిఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి.జోగాపూర్ గ్రామానికి చెందిన బుర్ర వెంకటేష్(25) వేములవాడ రూరల్ మండలం వట్టెముల గ్రామంలో ఉంటున్నాడు.ఈ క్రమంలో ఈ నెల7న,సొంత పనుల నిమిత్తం తన ద్విచక్ర వాహనం పై చందుర్తి మండలం జోగాపూర్ వచ్చి తిరుగు ప్రయాణం మూడపల్లి వెంకటేశ్వర ఆలయ సమీపంలో అదుపు తప్పి కాల్వర్టులో పడిపోయాడు దీంతో వెంకటేష్ అక్కడిక్కడే మృతి చెందాడు.చీకటైన ఇంటికి రాకపోవడం పోన్ చేస్తే స్విచ్ ఆప్ రావడం తో మృతుని భార్య కావ్య వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ పెట్టింది దీంతో వేములవాడ పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో రోడ్ వెంబడి ఉన్న కాల్వర్టులను పరిశీలించగా మూడపల్లి వద్ద ఉన్న కల్వర్టులో విగత జీవుడిగాపడి ఉన్నాడు.దీంతో పోలీసులు బంధువులకు సమాచారం అందించారు.ఈ ఘటన పై బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరు అన్నదమ్ముల మృతి తో జోగాపూర్ లో విషాదం
వెంకటేష్ తల్లి ఎనిమిది సంవత్సరాల కింద అనారోగ్యం తో చనిపోయింది. అన్న పర్శరాం గత మూడు సంవత్సరాల కిందట చందుర్తి మండల కేంద్రంలో రోడ్ ప్రమాదంలో చనిపోయాడు ఆ ఘటన నుండి తెరుకోక ముందే వెంకటేష్ రోడ్ ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.