నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో ఆదివారం ట్రాక్టర్ బావిలో పడి కైరా శేఖర్ (28) అనే యువకుడు మృతి..గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాక్టర్ను, చనిపోయిన వ్యక్తిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు,పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అన్నారు.