మండలంలోని దాస్ నగర్ సమీపంలో ఓ యువకుడు కుటుంబ కలహాలతో ఉరి వేసుకొని మృతి చెందిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని అమ్రాద్ గ్రామానికి చెందిన పద్మశాలి శ్రవణ్ (32) కుటుంబ కలహాలతో వారం రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడని, దాస్ నగర్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొని కుల్లి పోయిన శవం లభ్యమైంది. మృతునికి ఇద్దరు పిల్లల లు ఉన్నారు. శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మృతుని బార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.