విద్యుద్ఘాతంతో యువకుడు మృతి..

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో దుద్దిళ్ల నిశాంత్ (24) అనే వివాహితుడు మృతి చెందిన సంఘటన మండలంలోని రుద్రారం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల, గ్రామస్తుల పూర్తి కథనం ప్రకారం.. నిశాంత్ ఇంటివద్ద బోర్ మోటార్ వైర్ ను లూజు ఉండని పైకి కడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలిపారు. కాగ మృతునికి 6 నెలల క్రితమే వివాహం జరిగింది. నిశాంత్ అకాల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.