నవతెలంగాణ-మల్హర్‌రావు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన సంఘటన మల్హర్‌రావు మండలంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… మండలం పరిధి ఆన్‌సాన్‌పల్లి గ్రామానికి చెందిన అజ్మీర శివరాం -పద్మ దంపతుల కుమారుడు శ్రీనివాస్(20) భూపాలపల్లిలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అద్వాలపల్లి లంబాడి తండాలోని బంధువుల ఇంటికి తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడానికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా నాగులమ్మ టెంపుల్ మూల మలుపు వద్ద మల్లారం రోడ్డు మార్గంలో ఎదురుగా బొగ్గు లోడుతో వస్తున్న లారీని తప్పించబోయి కొయ్యూరు నుంచి తాడిచర్లకు వెళ్తున్న బొగ్గు టిప్పర్ వెనుక గొలుసు కడ్డీకి తగిలి బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో శ్రీనివాస్‌ను లారీ కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లగా శ్రీనివాస్ మృతిచెందినట్టు స్థానికులు తెలిపారు.