రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండల పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి పట్టణంలోని శివయ్య గారి బజార్ కు చెందిన జోకాలు రాము (13) బైక్ మెకానిక్ గా పని చేస్తున్నాడు.అతని స్నేహితుడు జీళ్ళ భాను తో కలిసి ఊట్లపల్లి సమీపంలోని వెంకమ్మ చెరువు నుండి ద్విచక్ర వాహనంపై ఆశ్వారావుపేట కు బయలుదేరారు. అశ్వారావుపేట నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుక్కునూరు మండలం రాజీవ్ నగర్ కు చెందిన కారు ఎదురుగా ఢీకొంది.ఈ ప్రమాదంలో రాము అక్కడికక్కడే మృతి చెందాడు. భాను కు తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న ఎస్.హెచ్.ఓ ఎస్సై శ్రీరాముల శ్రీను సంఘటనా స్థలానికి చేరుకుని పోస్ట్ మార్టం నిమిత్తం రాము మృత దేహం తో పాటు గాయపడ్డ భాను ను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని బంధువుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించనున్నట్లు ఎస్సై తెలిపారు.