మామిడిపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

నవతెలంగాణ-ఆర్మూర్  : మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శివారు అయ్యప్ప గుడి యానం గుట్ట వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం జక్రాన్ పల్లి నుంచి ఆర్మూర్ వైపు బైక్ పై వస్తున్న ఇద్దరు యువకులను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో  తోర్లికొండ గ్రామానికి చెందిన మహి వర్ధన్ గౌడ్ 17 సంవత్సరాలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో యువకునికి తీవ్ర గాయాలయ్యాయని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి ,తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు .లారీ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.