గుండెపోటుతో యువకుడు మృతి

నవతెలంగాణ-మిరు దొడ్డి : సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లోని అక్బర్ పేట-భూంపల్లి మండలం మోతే గ్రామంలో గుండెపోటుతో యువకుడు మృత్యువాత పడ్డాడు. గ్రామానికి చెందిన నీల సంతోష్ ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోవడం జరిగిందన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108కు సమాచారం అందించడం జరిగిందన్నారు. 108 వాహనం ఇంటికి చేరుకునే సంతోష్ మృతి చెందిన జరిగిందన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే సంతోష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉంటూ కుటుంబ భారాన్ని మోస్తున్న సంతోష్ మృతి చెందడంతో గ్రామస్తులు చందాలు వేసుకొని మృతుని కుటుంబానికి 45 వేల ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ శ్రీనివాస్ తో పాటు గ్రామస్తులు కోరారు.