జీవితంపై విరక్తి చెంది ఒక యువకుడు మృతి చెందాడని జన్నారం ఎస్సై రాజవర్ధన్ తెలిపారు. బీహార్ కు చెందిన సింటు కుమార్ మండలంలోని మొర్రిగూడ గ్రామ శివారులో ఉన్న ఒక పరిశ్రమలో వారం రోజుల క్రితం పనికి చేరాడన్నారు. అయితే అతడు తాగుడుకు అలవాటు పడి పని చేయడం ఇష్టం లేక ఆ పరిశ్రమ పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ ముందు ఉన్న గేటుకు తన టవల్ తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ వెల్లడించారు. అయితే చింటూ కుమార్ ఫోన్ చేసి తనతో కూలి పని చేయడం జీవితంపై విరక్తి పుడుతుందని మాట్లాడారన్నారు. మృతుని అన్న కమల్ పాశ్వాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.