
ప్రమాదవశాత్తూ విద్యుత్ ఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన అల్లి రవి (20)మండల కేంద్రంలో ఒక స్కూటర్ మెకానిక్ సెంటర్ లో మెకానిక్ గా పని చేస్తున్నాడు. రోజు వారి పనిలో భాగంగా మధ్యాహ్నం మోటార్ సైకిల్ ను వాటర్ సర్వీస్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులుఅది గమనించి రవినీ బ్రతికించడం కోసం తోటి స్నేహితులు, పి సి అర్ చేసి మెరుగైన వైద్యం కోసం 108 కి సమాచారం అందించి సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయాడని తెలిపారు. ఈ మరణం విద్యుత్ అధికారుల నిర్లక్యంగానే జరిగిందని, గత కొన్ని రోజులుగా ఈ ఏరియా మొత్తం ఇంట్లో కరెంట్ షాక్ వస్తుందని చెప్పిన సరి చేయలేదని ముమ్మాటికీ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే రవి మృతి చెందాడని ఆరోపించారు. చేతికి అందిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.