అనారోగ్యంతో యువకుడు మృతి

A young man died of illnessనవతెలంగాణ – ఆళ్ళపల్లి 
అనారోగ్యంతో యువకుడు మృతి చెందిన సంఘటన ఆళ్ళపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మర్కోడు గ్రామానికి చెందిన చామకూరి అంజయ్య – ఉపేంద్ర దంపతుల కుమారుడు సాగర్ (26) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ మంగళవారం సాగర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య కలదు.