చికిత్స పొందుతూ యువకుడు మృతి

నవతెలంగాణ- తాడ్వాయి 
తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ గ్రామానికి చెందిన కుమ్మరి రాజు ( 32 )అనే యువకుడు చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… గత వారం రోజుల క్రితం తాడ్వాయి గ్రామంలో దోమల మందు పిచికారి చేయడం కోసం రాజు కూలికి వచ్చాడు  దోమల మందు పిచికారి చేస్తున్న సమయంలో సేఫ్టీ దుస్తులు, మాస్కు ధరించకుండానే దోమల మందు పిచికారి చేయడంతో శరీరంపై దోమల మందు పడింది.దీంతో చర్మం ఊడిపోయింది.రాజు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు నిజామాబాద్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో బుధవారం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు ఈ విషయమై రాజు భార్య మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు