జంపన్న వాగులో యువకుడి గల్లంతు..

సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన స్వాగత్‌(23) జంపన్న వాగులో గల్లంతయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. మంచిర్యాల జిల్లా– మృతదేహం లభ్యం
నవతెలంగాణ -తాడ్వాయి 
సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన స్వాగత్‌(23) జంపన్న వాగులో గల్లంతయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన స్వాగత్‌ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం మేడారం వచ్చాడు. దర్శనం అనంతరం జంపన్నవాగు ప్రాంతంలో విడిది చేశారు. బంధువుల పిల్లలతో కలిసి స్వాగత్‌ కొత్తూరు లోలెవల్‌ కాజ్‌వే సమీప పాలమడుగుకు వద్ద జంపన్నవాగులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. లోతు తెలియక మునిగిపోయాడు. తోటి పిల్లలు బంధువులకు, పస్రా సీఐ శంకర్‌కు సమాచారం ఇచ్చారు. తాడ్వాయి స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సూచనల మేరకు లక్నవరం మత్స్య సహకార సంఘం అధ్యక్షులు లూజు వెంకన్న ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కలిసి రెండు గంటలపాటు వాగులో మునిగి మృతదేహాన్ని వెలికి తీశారు. లక్నవరం మత్స్య పరిశ్రమ సంఘం గజ ఈతగాళ్లకు ములుగు డి.ఎస్.పి ఎన్ రవీందర్, స్థానిక తహసిల్దార్ తోట రవీందర్ అభినందించారు. కేసు నమోదు చేసి స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు