నవతెలంగాణ అచ్చంపేట: ప్రింకల మండలం ముల్గర గ్రామపంచాయతీకి చెందిన జి మహేష్ 2017లో ఎస్జిటి ప్రభుత్వ టీచరుగా ఉద్యోగం సాధించాడు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డీఎస్సీ ఫలితాలలో స్కూల్ అసిస్టెంట్ గా మరో ఉద్యోగం సాధించాడు. మళ్లీ ఇప్పుడు జూనియర్ లెక్చరర్ ఫలితాలలో విజయం సాధించి జూనియర్ లెక్చరుగా ఎంపికయ్యాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునే ఈ రోజులలో పట్టుదలతో కృషితో మూడు ఉద్యోగాలు సాధించి నేటి సమాజంలో యువతకు ఆదర్శంగా నిలిచాడు. మహేష్ మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు అతని స్నేహితులు, శ్రేయోభిలాషులు వర్షం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు.