పెద్ద కొడప్ గల్ మండలంలోని జగన్నాథ్ పల్లి తాండ సమీపంలోనీ 161 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గంగిశెట్టి శ్రీకాంత్ 19 సంవత్సరాల యువకుడు అతని స్నేహితులతో కలిసి హైదరాబాద్ నుండి కౌలాస్ కోటకు సందర్శనకు ఉదయం8గంటల సమయంలో వచ్చారు. కౌలాష్ కోటను సందర్శించిన అనంతరం తిరిగి ప్రయాణిస్తుండగా మండలంలోని జగన్నాథ్ పల్లి తాండ సమీపంలోని 161 రహదారిపై శ్రీకాంత్, అతనితో వచ్చిన వ్యక్తులతో కలిసి ద్విచక్ర వాహనాలపై వెళ్తుండగా అతివేగంగా ఆజాగ్రత్తగా వాహనంనడిపిస్తున్న సందర్భంగా అదే రోడ్లో వస్తున్న లారీ పక్క నుండి ఢీకొనడంతో శ్రీకాంత్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హైవే సిబ్బంది స్థానిక పోలీసులు కలిసి సంగారెడ్డి హాస్పిటల్ తరలించారు. గాయాలైన శ్రీకాంత్ మామయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.