ఎమ్మెల్యే శ్రీధర్ బాబుపై అభిమానం చాటుకున్న యువకుడు 

నవతెలంగాణ-రామగిరి :

తన అభిమాన నాయకులపై ఎన్నో చిత్రవిచిత్రాలు చేస్తూ దీనిలో భాగంగా తమ అభిమాన నాయకుడైన మంత్రి ఎమ్మెల్యే మాజీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చిత్రపటం తన గుండెపై పచ్చబొట్టుతో పొడిపించుకున్నాడు. యువతకు ఆయనే స్ఫూర్తి ఆయన మా ఇష్టం గౌరవం అందుకే శ్రీధర్ బాబుని ఈ ప్రాంత యువత గుండెల్లో పెట్టి చూసుకుంటారు. రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు గుర్రాల దిలీప్ ముదిరాజ్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు పై ఉ న్న అభిమానంతో తన గుండెల మీద పచ్చబొట్టు వేసుకొని తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన అభిమాన నాయకుడైన శ్రీధర్ బాబు చిరస్థాయిగా తన గుండెల పైన ఉండాలని కోరుకుంటున్నాడు.