ఉరి వేసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని పేరాయిగూడే నికి చెందిన రావూరి వంశీ (24) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు.రోజు లానే పనికోసం ఇంటి నుండి బయలు దేరి వెళ్ళి స్థానిక కెమిలాయిడ్స్ ఫ్యాక్టరీ వెనుక ప్రాంతంలోగల ఓ మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటువైపుగా వెళ్లిన కొంతమంది పశువుల కాపరులు మామిడీ చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న అదనపు ఎస్సై శివరామకృష్ణ ఘటన స్థలాన్ని పరిశీలించి,మృతదేహాన్ని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి కి తరలించారు.కాగా యువకుడి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై కుటుంబీకుల నుంచి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు రాలేదని,కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడు వంశీ అవివాహితుడు కాగా,ఇతనికి తల్లిదండ్రులు ముత్తయ్య, అలివేలు,అన్న, చెల్లి ఉన్నారు. మృతి విషయం తెలియడంతో వారంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.