నవతెలంగాణ- బైంసా : పట్టణంలోని ఆదిత్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శివ కాంత అనే మహిళకు అత్యవసరంగా బి పాజిటివ్ బ్లడ్ అవసరం ఏర్పడింది.. వాట్సాప్ గ్రూపులో సమాచారం తెలపడంతో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి బండారి అశోక్ వెను వెంటనే స్పందించారు. రక్త దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. రక్తదాతను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.