ఓ యువకుడి పోరాటం…

డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల ప్రస్తుతం న్యూ ఏజ్‌ పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘పెదకాపు-1’ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంతో విరాట్‌ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్‌. ఈ చిత్రాన్ని ఈనెల 29న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ సోమవారం అనౌన్స్‌ చేశారు. ‘అణచివేత, ఘర్షణల నేపథ్యంలో రూపొందిన చిత్రం. ఒక సామాన్యుడి నుండి ఇద్దరు శక్తివంతమైన వ్యక్తులకు వ్యతిరేకంగా కథానాయకుడు చేసే పోరాటం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది’ అని మేకర్స్‌ చెప్పారు