ప్రజావాణిలో యువకుని ఆత్మహత్యాయత్నం

నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్‌ఎంసీలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వివరాల్లోకెళ్తే.. తగరం అనిల్‌ కుమార్‌ సోమవారం ప్రజావాణికి వచ్చాడు. తన ఇంటి నిర్మాణం విషయంలో కుటుంబ సభ్యుల కలహాల వల్ల అధికారులు నిర్లక్ష్యం వహించి ఆరోపణలు చేస్తున్నారని పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన పోలీసులు, విజిలెన్స్‌ అధికారులు వెంటనే అడ్డుకున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులకు లంచం ఇచ్చినా పట్టించుకోలేదని బాధితుడు ఆరోపించాడు. ముషీరాబాద్‌ ఏసీపీ, డీసీని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశాడు. ప్రస్తుతం అనిల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.