మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా) : ఆస్ట్రేలియాలో దారుణ ఘటన జరిగింది. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం బక్‌లేలో హైదరాబాద్ ఏఎస్‌రావునగర్‌కు చెందిన వివాహిత చైతన్య మదగాని అలియాస్ శ్వేతను గత శనివారం దుండగులు హత్య చేశారు. చైతన్యను చంపిన దుండుగులు ఆమె మతదేహాన్ని రోడ్డు పక్కన చెత్త డబ్బాలో పారేశారు. హత్యకు సంబంధించి సెకండ్ క్రైమ్ సీన్‌ను పాయింట్ కుక్‌లోని మిర్కా వేలో ఉన్న చైతన్య ఇంట్లో పోలీసులు రీ క్రియేట్ చేశారు. అయితే హత్య చేసిన వాళ్లు చైతన్యకు తెలిసిన వాళ్లేనని పోలీసులు చెబుతున్నారు. ఆమెను చంపిన తర్వాత దుండగులు వేరే దేశానికి పారిపోయారని తెలిపారు.