
మండలంలోని రాంపూర్ గ్రామంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. అమాయకులకు బెదిరింపు కాల్స్ రావడంతో అనుమానంతో తిప్పి కొట్టిన సంఘటన ఆదివారం చోటు చసుకుంది. వాట్సాప్ కాల్ లో ఇద్దరికీ కాల్ చేయగా ఒకరు నెట్ ఆఫ్ ఉండగా.. మరొకరికి వాట్స్అప్ కాల్ చేసి వారి యొక్క వివరాలు చెప్పుతూ పోలీసు అని బెదిరించారు ..మీ నాన్న డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు అని చెప్పార్… మీ నాన్న చేతులు కట్ చేస్తాం లేదా డబ్బులు కావాలి పంపండి అని అన్నారని యువతి తెలిపింది. ఇండియావి డబ్బులు ర.10000 రూపాయలు కావాలని అన్నాడు. మా వద్ద అన్ని డబ్బులు లేవు. ఇప్పుడు రూ.5000 ఉన్నాయి అన్నారు. అయితే ఇప్పుడు రూ.5000 పంపు తర్వాత మళ్ళీ రూ.5000 పంపు లేకుంటే మీ నాన్న చేతులు కట్ చేస్తాము. జైల్లో వేస్తామని బెదిరించారు. వద్దు సార్ ఏం చేయకండి అని చెప్పి భయపడి మాకు ఓక కొద్దిగా గడువు ఇవ్వండి అన్నారు. తర్వాత.. వాట్సాప్ కాల్స్ చాలా సార్లు చేశారు. కాల్ కట్ చేస్తే రిసీవ్ చేయకుంటే ఎస్ఎంఎస్ లు చేశారు.. అమ్మాయికి భయమేసి ఇంటి పక్కన ఉన్న అన్నయ్యకు ఫోన్ ఇవ్వడంతో ఏమైందని ఆ వాట్సప్ కాల్ అతనితో మాట్లాడారు. ఆ ఫోన్ కాలు అతనికి ఇవ్వు మాట్లాడతామంటే అతను మాట్లాడుతలేడు. ఏడుస్తున్నాడు అని, సైబర్ నేరగాళ్లు ఫోన్లో మాట్లాడినట్టు మేం నమ్మడం లేదని, వాళ్ళు ఎవరో అని అనడంతో మీ ఇష్టం ఉన్నది చేసుకోవాలని యువతి యువకులు వారి మోసాన్ని తిప్పుకొట్టారు.