
మండల కేంద్రానికి చెందిన భీమ లలిత క్రీ:శే భీమ మోహన్,దంపతుల కుమారుడు భీమ రాజ్ కుమార్ మిషన్ భగీరథలో ఆసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా ఎంపికయ్యారు.ఇటీవల వెలువడిన ఏఈఈ పరీక్ష ఫలితాల్లో రాజ్ కుమార్ ఉత్తమ ప్రతిభ చాటడంతో ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికై నట్లు రాజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తల్లి లలిత మాట్లాడుతూ ప్రతి రోజూ రాత్రి పగలు కష్టపడి చదివి అనుకున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ సాధించడం వల్ల వారి తల్లి ఎంతో ఆనందం సంతోషంగా ఉందని అన్నారు. మా కుమారుడు ఈ జాబ్ సాధించడం మాకు గర్వకారణం అని కొనియాడారు.క్రమశిక్షణతో కష్టపడి చదివే అలవాటు చేసుకోవాలని తద్వారా అనుకున్న జాబ్ లను సులువుగా సాధించుకోవచ్చు అని పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ జమున రాజేందర్, రాజ్ కుమార్ నీ అభినందించారు.