సజన్ కుమార్ బొజ్జంతో కలిసి లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణు గోపాల్ నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, కుష్‌బూ చౌదరి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. మార్చి 22న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ,’నలుగురు స్నేహితుల కథ ఇది. వారి స్నేహం, ప్రేమ, లైఫ్ జర్నీ ఈ చిత్రంలో చూపిస్తున్నాం. నేటి యువతరాన్ని అమితంగా ఆకట్టుకునే ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో కుటుంబ ప్రేక్షకులను అలరించే భావోద్వేగాలు కూడా ఉన్నాయి. అభిరుచి గల నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌తో కలిసి సజన్ కుమార్ బొజ్జం ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. తప్పకుండా ఈ చిత్రం యూత్‌కు ఓ ఫెస్ట్‌లా ఉంటుంది’ అని అన్నారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి, అసోసియేట్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డె, డీఓపీ: సంతోష్ రెడ్డి, సంగీతం: హర్ష వర్థన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధ్రువన్, వసంత్.జి, పాటలు: క్రిష్ణ కాంత్, కాసర్ల శ్యామ్, రఘురామ్, ఎడిటర్: విజరు వర్థన్, కథ, స్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: విక్రమ్ రెడ్డి.