యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

Youthful Family Entertainerసందీప్‌ కిషన్‌ నటిస్తున్న తన 30వ సినిమా ‘మజాకా’. త్రినాథరావు నక్కిన దర్శకుడు. ఎకె ఎంటర్టైన్మెంట్స్‌, హాస్య మూవీస్‌, జీ స్టూడియోస్‌ బ్యానర్స్‌ పై రాజేష్‌ దండా, ఉమేష్‌ కెఆర్‌ బన్సాల్‌ నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాత. రీతూ వర్మ హీరోయిన్‌. ఆదివారం ఈచిత్ర టీజర్‌ను మేకర్స్‌ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా హీరో సందీప్‌ కిషన్‌  మాట్లాడుతూ, ‘ఇది నా 30వ సినిమా. దీన్ని ఒక బాధ్యతగా భావిస్తున్నాను. నా గత సినిమాలు ‘భైరవకోన, రాయన్‌’ మంచి రిజల్ట్స్‌ ఇచ్చాయి. ప్రేక్షకులు నా నుంచి మంచి ఫ్యామిలీ  ఎంటర్‌టైనర్‌ని కోరుకుంటున్నారని వారితో మాట్లాడినప్పుడు తెలిసింది. వారు కోరుకున్న సినిమా చేయడం నా బాధ్యత. అలాంటి సమయంలో ‘మజాకా’ నా దగ్గరకి  వచ్చింది. హాస్య మూవీస్‌ అంటే నా హోం బ్యానర్‌. రాజేష్‌కి, అనిల్‌కి ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజారు చేసే  సినిమా ఇది’ అని తెలిపారు. ‘ఇది నాకు చాలా ఇష్టమైన కథ. సినిమా ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌. ‘మన్మధుడు’ తర్వాత అన్షు ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. తన  పాత్ర చాలా బాగుంటుంది. చాలా అద్భుతంగా చేసింది. సినిమా రిలీజైన తర్వాత సీట్లు కాదు గేట్లు పగులుతాయనిపిస్తోంది. అంత కామెడీ ఉంటుంది సినిమాలో. ప్రతి సీన్‌ ప్రసన్న  అద్భుతంగా రాశారు. ఎమోషన్‌ సీన్స్‌ కూడా ఉంటాయి. సందీప్‌ ఎక్స్‌లెంట్‌గా చేశారు. ఫిబ్రవరి 21న సినిమా మీ ముందుకు వస్తోంది. ఫ్యామిలీతో వెళ్లి ఎంజారు చేయండి’ అని  డైరెక్టర్‌ త్రినాథ్‌ నక్కిన చెప్పారు. నిర్మాత రాజేష్‌ దండా మాట్లాడుతూ, ‘ఈ కథ వినప్పుడు నాన్‌ స్టాప్‌గా రెండు గంటలు నవ్వుకుంటూనే ఉన్నా. మంచి యూత్‌ ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తీశాం. నా బ్యానర్‌లో ఇప్పటివరకూ తీసిన సినిమాలన్నింటి కంటే బెస్ట్‌ మూవీ తీశానని గర్వంగా చెప్పుకోవచ్చు. ‘ధమాకా’ తర్వాత త్రినాథ్‌ ఈ కథ నచ్చి డైరెక్షన్‌ చేశారు. నా బ్యానర్‌కి వందకోట్ల సినిమా ఇస్తున్నారని బలంగా నమ్ముతున్నాను’ అని తెలిపారు.