ప్రజాస్వామ్యం అంటే ”ప్రజల చేత – ప్రజల కొరకు – ప్రజల యొక్క” అర్థం పూర్తిగా మారిపోయి, కరడు కట్టిన నేర స్థులు, ఆర్థిక నేరస్థుల చేతుల్లో ”నాయకుల చేత – నాయ కుల కొరకు – నాయకుల యొక్క” గా మారిపోయింది. వారు కష్టపడి పన్నులు కట్టిన వారి డబ్బుని అక్రమ పద్ధతుల్లో సంక్షేమం పేరు తో ప్రభుత్వ ఖజానాలను, దేశాన్ని సంక్షోభం లోకి నెట్టి సర్వ నాశనం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలను నేరుగా జన్‌ధన్ బ్యాంకు ఖాతాల్లో వెయ్యటానికి ఆధార్ సంఖ్య చరవాణి సంఖ్యలను అనుసంధానం చేస్తున్నారు. స్థిరాస్థి రిజి స్ట్రేషన్లు, పాన్ నంబర్లను కూడా ఆధార్‌కు అనుసంధానం చేశారు. జీవితమంతా ఆధార్ మీదే ఆధార పడాలనేట్టుగా చేశారు. చివరకు ఆధార్ సంఖ్య ”శస్త్రచికిత్స అద్భుతంగా జరి గింది కానీ రోగి మరణిం చాడు” అన్న చందంగా తయారైంది.
140 కోట్లు జనాభా ఉన్న మన దేశంలో 136 కోట్ల మంది ఆధార్ సంఖ్యను తీసుకున్నారు. కాగా ప్రపంచ ఆర్థిక వేదిక 2018 లోనే 110 కోట్ల మంది ఆధార్‌లు హ్యాక్ అయ్యాయని ఎంతగానో మొత్తుకున్నా యూనిక్ ఐటెంటి ఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) భారత ప్రభుత్వాలు మాత్రం అబ్బే అలాంటిదేమీ జరగలేదంటూ తేలిగ్గా కొట్టి పారేశారు. ఆధార్ ధ్రువీకరణ మొదలు, బయో మెట్రిక్ విశ్వసనీయత వరకు అనేక అనుమానాలున్నాయని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ”మూడీస్” చెప్పినా పెడచెవిన పెట్టారు. 2023 ఆక్టోబర్ 9న అమెరికా నిఘా సంస్థ ‘రీసెక్యూరిటీ’ 81.5 కోట్ల భారతీయుల ఆధార్ పూర్తి సమాచారాన్ని క్లియర్‌అండ్ డార్క్‌వెబ్‌లో 60 లక్షల రూపా యలకు అమ్మకానికి పెట్టారని వెల్లడించింది. కోవిడ్ కాలంలో కరోనా వాక్సిన్లకు ఆధార్, బయోమెట్రిక్‌ల గోప్యత లోపించ టంతో కోట్ల మంది సమాచారం తస్కరించబడింది.
ప్రభుత్వం, బ్యాంకులు ఆర్భాటంగా, వేలంవెర్రిగా ఆధార్ ని అందరినెత్తినా బలవంతంగా రుద్దటం మూలంగానే ఆర్థిక లావాదేవీల్లో అనేక మోసాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికే సిలికాన్, బంకవేలి ముద్రల నకిలీ నకళ్లతో దొంగ హాజరు నిధుల తస్కరణ జరుగుతున్నాయి. ఇదే పద్ధతిలో సైబర్ నేరగాళ్ళు బంక వేలిముద్రలతో బ్యాంకు ఖాతాలోలని డబ్బంతా ఊడ్చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆధార్ వినియోగాన్ని కొన్ని షరతులతో అనుమతించి నప్పటికి, నానాటికీ ఆర్థిక మోసాలు పెరిగిపోతున్నాయి. పాత పద్దతిలో ఏటీఎంల నుంచి కార్డుతో సులువుగా డబ్బులు తీసుకునే వాళ్ళం. ఏటీఎం సెంటర్లలో నేరస్తులు మన కార్డుల్ని క్లోనింగ్ చేసి డబ్బంతా కాజేస్తున్నారు.
ప్రస్తుతం ఆధార్ ఎనంబ్లడ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈ పీఎస్) అంటే ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ కొంప నిలు వునా ముంచుతోంది. ఒక రకంగా కూలీలకు, రైతులకు, గ్రామీణులకు, అత్యవసరమైన వారికి ఈ వ్యవస్థ బాగున్న ప్పటికీ సైబర్ నేరగాళ్ళు నకిలీ వేలిముద్రలతో దఫాకు పది వేల రూపాయలు చొప్పున రోజు మొత్తం మీద 5 దఫాలు అంటే 50 వేల రూపాయలు కొట్టేస్తున్నారు. మన ఖాతాలో, లక్ష రూపాయ లుంటే మనకు బ్యాంకు నుండి, ఎస్‌ఎంఎస్,ఈ మెయిల్ రాకపోయినా, ఈ లావాదేవీలను మనం గమనించక పోయినా రెండు రోజుల్లో ఖాతా మొత్తం ఖాళీ అవుతుంది. ఈ వ్యవస్థ ద్వారా 2010 నుండి బ్యాంకులో ఆధార్ కార్డు ద్వారా డబ్బులు వేయడం, తీయటం, బదిలీ చేయటం సాధ్యపడుతుంది. బ్యాంకు లావాదేవీలకు ఎస్‌ఎంఎస్ ద్వారా ఓటీపీ వస్తుంది. (ఏఈపీ ఎస్)లో ముందస్తు సమాచారం ఏదీ ఉండదు. ఈ లావాదేవీ లన్నీ రిజర్వ్ బ్యాంకు పర్యవేక్షిస్తుంది. నేషనల్ పేమెంట్ కోపరేషన్ ఆఫ్ ఇండియా( ఎన్‌పీసీఐ)ని బ్యాంకులకు ఉచితంగా ఇచ్చింది.
2019-2023 మధ్య 8,68 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలన్నీ (ఏఈపీఎస్) ద్వారా జరిగాయి. మార్చి 2023 నాటికి 34.1 కోట్ల మంది 485.94 కోట్ల (ఏఈపీఎస్) లావా దేవీలను జరిపారని కేంద్రమంత్రి డా|| భగవత్ కరాడ్ చెప్పారు. అయితే ఎస్‌బీఐ నుండే ఎక్కువ లావాదేవీలు జరగటం వల్ల ఎక్కువ మోసాలు ఇక్కడే జరిగాయి. 2023లో (ఏఈ పీఎస్) లావాదేవీల్లో ఎస్‌బీఐలో రూ.10 లక్షలు, కెనరా బ్యాంకులో రూ.14.29 లక్షలు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.9.91 లక్షలు, పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.8.79 లక్షలు పోగొట్టుకున్నారని, సైబర్ క్రైమ్ స్త్రశీఙ.ఱఅ నమోదు కాని లావాదేవీలు, కోట్లలో ఉండొచ్చు అనే సందేహమూ ఉంది. (యూఐడీఏఐ)లో మోసపూరిత ప్రయత్నాలను గుర్తించేందుకు నకిలీ బంక వేలిముద్రలను పసికట్టేందుకు అంతర్గతంగా భద్రమైన వేలిముద్రలను మేధా అభివృద్ధి యాంత్రిక వ్యవస్థ ఉందని సదరు మంత్రిగారు ఎప్పుడో చెప్పారు.
కానీ 2023 సెప్టెంబరు 16న మా అమ్మ గారి కోసం బీఎస్‌ఎన్‌ఎల్, చందానగర్, హైదరాబాద్ కెళ్ళి నా ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ ఇచ్చి సిమ్‌కార్డు తీసుకున్న, రెండు రోజులకే నా కొటక్ మహీంద్రా బ్యాంకు ఖాతా నుండి 9999 రూపాయలు, యూనియన్ బ్యాంకు ఖాతా నుండి రూ.మూడు వేలు (ఏఈపీఎస్) ద్వారా సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. (ఏఈపీఎస్) లావాదేవీలు సెల్‌ఫోన్లలో సిగల్స్ సరిగ్గా రాక, ఇంటర్ నెట్ కనెక్టివిటీ సరిగా లేక, బ్యాంకు ఖాతాల్లో తగు బ్యాలెన్సులేక, శ్రామికులు, వృద్ధులు, బాలల బయోమెట్రిక్ నిర్ధారణ క్లిష్టంగా ఉండటం వల్ల 34 శాతం విఫలమవు తున్నాయి. లేకుంటే మరిన్ని సైబర్ దాడుల్లో మరిన్ని డబ్బులు పోయేవి. బ్యాంకు ఏజెంట్లు, బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా ఈ రకం లావాదేవీలు జరుపుకోవటానికి 35 బ్యాంకులు అంగీక రించాయి. దేశవ్యాప్తంగా బ్యాంకు ప్రాంగణంలో 1,10,282 ఏటీఎంలు, బ్యాంకు వెలుపల 1,38,579 ఏటీఎంల నిర్వహణ ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నందున వీటి పర్యవేక్షణ, రక్షణ వ్యవస్థ, భద్రత లోపించాయి. (ఏఈపీఎస్) లావాదేవీలు సక్రమంగా జరిగేందుకు యూపీఐ లైట్‌ఆఫ్ వైన్ బయోమెట్రిక్ ధ్రువీకరణ, నాణ్యమైన, నమ్మకమైన ‘నోబెల్ సాఫ్ట్‌వేర్’ని వాడాలి.
బ్యాంకు ఖాతాల్లో తమ ప్రమేయం లేకుండా సైబర్ నేరగాళ్లు (ఏఈపీఎస్) ద్వారా డబ్బుని కాజేస్తే 3 పని దినా ల్లోగా బ్యాంకు కి తెలియజేస్తే 90 రోజుల తర్వాత డబ్బు తిరిగి ఇస్తా రట. లేదంటే ఇవ్వరని ఆర్‌బీఐ చెబుతుంది. సీరియస్‌గా ఉన్న వారు, హాస్పిటల్ రోగులు, బ్యాంకు నుండి లావాదేవీల ఎస్‌ఎం ఎస్‌లు, మెయిల్స్ రానివారు, ఫోన్లు పాడైనవారు, సెల్‌ఫోన్ సిగల్స్ రానివారు, బిజీగా ఉండే వారు, నిరక్షరాస్యులకు 3 పని దినాల్లో బ్యాంకుకు తెలియ చేయటం సాధ్యమేనా! (ఏఈపీఎస్) బాధితులు ముందుగా బ్యాంకు హెల్ప్ లైన్ లేదా కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి జరిగిన మోసం చెప్పి, ఖాతాలో అన్ని బ్యాంకు లావా దేవీలను నిలిపివేయ్యమని చెప్పాలి. తర్వాత సైబర్‌క్రైమ్ స్త్రశీఙ.ఱఅ ఫిర్యాదు చేసి, ఆ ఎక్నాలెడ్జిమెంట్ ఉన్న పేపర్‌ను, ఒక లెటర్‌ను బ్యాంకులో ఇవ్వాలి. బ్యాంకు నుండి దీనికి సంబంధించిన ఫిర్యాదు సంఖ్యను, రశీదును తీసుకోవాలి. వెంటనే ఖాతా నుండి ఆధార్ వివరాలను తీసివేయాలి. దీని బదులు డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు, పాస్‌పోర్టు లాంటి జిరాక్స్ (ఏదో ఒక ఫ్రూఫ్) ఇవ్వాలి. బ్యాంకు అకౌంట్ తెరిచే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఆధార్ ఇవ్వొద్దు మరీ తప్పనిసరి అయితే 12 అంకెల బదులు చివరి 4 అంకెలున్న ముసుగు (మాస్క్) ఆధార్ మాత్రమే ఇవ్వా లి. అనవసరంగా బయోమెట్రిక్ ఇవ్వొద్దు. కొన్ని బ్యాంకులు కావా లని ఖాతాదారుల్ని ఆధార్, బయోమెట్రీలంటూ చంపేస్తున్నారు.
తరచూ బ్యాంకు ఖాతా, డెబిట్ ఏటీఎం కార్డు పిన్, ఇంటర్ నెట్ పాస్‌వర్డ్‌లను మారుస్తూ ఉండాలి. సంఘటన జరిగిన 90 రోజుల తర్వాత పోగొట్టుకున్న మొత్తం డబ్బుని ఖాతాలో జమ చెయ్యాలని బ్యాంకుని అడగాలి, స్థిరాస్థుల రిజిస్ట్రేషన్లు, బ్యాంకు లావాదేవీలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు చాలా అప్ర మత్తంగా ఉండాలి. (యూఐడీఏఐ) సైట్ కి వెళ్లి విస్టువల్ ఐడీని సృష్టించుకోవాలి. ఆధార్ సంఖ్యలో 12 అంకెలు కాగా, వీఐడీలో 16 అంకెలు ఉంటాయి. వీఐడీ అంకెలు మనకు తప్ప వేరే ఎవరికీ తెలియవు. ఇదే సంఖ్యతో ఆధార్‌కు తాళం వెయ్యొచ్చు, తాళంతీయ్యొచ్చు, మన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వృద్ధుల ఆధార్‌లన్నింటికీ మన ఫోన్ నంబరు ఇవ్వటం సురక్షితం. (యూఐ డీఏఐ)లోకి వెళ్ళి మన ఆధార్ ధ్రువీకరణ ఎన్నిసార్లు (50 సార్లు జరిగిన) జరిగింది, ఎక్కడైనా దుర్వినియోగమవు తున్నదీ. తెలుసుకొని జాగ్రత్తగా ఉండొచ్చు. మిత్రులు, నెట్ సెంటర్లలో ఆధార్ డౌన్‌లోడ్ చేసుకుంటే, పనయ్యాక దీన్ని తొలగించేసుకోవాలి. సామాజిక మాధ్యమాలున్న వారు వివరాల గోప్యతను పాటించాలి.
బ్యాంకు లావాదేవీ ఆన్‌లైన్‌లో జరిపేటప్పుడు బ్యాంకు సైట్ పేరు సరిగ్గా ఉందా! లేదా! చివర డాట్ కామ్ లేదా ఆర్గ్ డాట్ ఉందాలేదా? సరిచూసుకోవాలి. తెలియని లింకులు వస్తే నొక్క వద్దు ఫోన్లలో మన వివరాలు చెప్పవద్దు. ఇలాంటి మోసాలు అరికట్టాలంటూ సెప్టెంబరు 2023లో ”బ్యాంక్ బచావో… దేశ్ బచావో…” అంటూ సామాజిక కార్యకర్తలు రిజర్వు బ్యాంకు గవర్నర్‌ని కలిసి (ఏఈపీఎస్) మోసాలకు బ్యాంకులనే బాధ్యులు చెయ్యాలని లేఖ ఇచ్చారు. ఆధార్ వ్యవస్థ పటిష్టత కోసం పార్లమెంట్, సుప్రీంకోర్టుల సమన్వయం, పర్యవేక్షణ, మార్గ దర్శకత్వం ఉండితీరాలి. దేశంలో ఏ ఒక్క పౌరుడికి ఆధార్ సంఖ్య ఎలాంటి నష్టాన్ని కలిగించకూడదు.
– ఎ.ఎన్.ఎస్.శంకరరావు, 9848685679