ఆధార్ కేంద్రాలు పెంచాలి

– సీపీఐ(ఎం) పార్టీ సత్తుపల్లి మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాస్.
నవతెలంగాణ- సత్తుపల్లి రూరల్ : ఆధార్ కేంద్రాలు అదనంగా ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) పార్టీ సత్తుపల్లి మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. స్థానిక ఫోస్టాఫీస్, ఆంద్రాబ్యాంక్ నందు సుమారు ఐదు నెలలుగా ఆధార్ అబ్ డేట్ చేస్తున్నారు. ఇలా ఒకటి రెండు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేయడం తో ప్రజలు అనేక ఇక్కట్లు పడుతున్నారన్నారని జాజిరి ఆవేదన వ్యక్తం చేశారు. సత్తుపల్లి కి చుట్టు ప్రక్కల సుదీర్ఘ ప్రాంతాలనుంచి పిల్లలతో ను, వెలుముద్రలు పడని ముసలివారు రోజులు తరబడి తిరుగుతూ అనేక ఇబ్బందులు కు గురువతున్నారు. అబ్డేట్ కేంద్రాలలో పని నత్తనడకన నడుస్తూ రోజుకి కనీసం 40 నుంచి 50 ఆధార్ కార్డులు పూర్తి చేయలేక పోవడంతో, సరైన సమాచారం ఇచ్చే సిబ్బంది సైతం లేక ఉదయం ఆరు గంటలకు వచ్చి సాయంత్రం వరకు ఉంన్నా వచ్చిన పనికాక పోవడంతో ప్రజలు అనేక మంది ఇక్కట్లు పడుతున్నారని, ఆధార్ కార్డు అబ్డేట్ కు, ఫోన్ నెంబర్ అనుసంధానం చేసుకొనుటకు గాను, 50 / రూ ల నుంచి 100/రూ లు అయ్యే ఖర్చు కంటే, ఆ పనికోసం రాను పోను, రోజు మొత్తం తిండి, తిప్పలుకు, పైగా ఇంటి వద్ద చేసే కూలీనాలి పని వదులుకోని ఇలా అనేక విధాలుగా ప్రజలు  అనేక విధాలుగా కష్ట నష్టాలను ఎదుర్కొనే దుస్థితి నుంచి బయట పాడేటందుకే అదనపు ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల్ని ఆదుకోవాలని జాజిరి  ప్రభుత్వాలని, సంబందించిన అధికారులు కు తెలియజేశారు.