– మరోసారి గడువు పెంపు
న్యూఢిల్లీ : ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ముగియనున్న వేళ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడారు) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గడువును మరోసారి పెంచుతున్నట్లు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసింది. 2025 జూన్ 14వ తేదీ వరకు.. అంటే ఏకంగా ఆరు నెలలు గడువు పెంచింది. దీంతో ఆధార్ కార్డులో చిరునామా మార్పులు చేసుకోవాలనుకునేవారు వెంటనే ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. యుఐడిఎఐ నిబంధనల ప్రకారం… ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆయా రుజువు పత్రాలు సమర్పించాలి. ఉచిత సేవలు ‘మై ఆధార్’ పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఉచితం గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్‌డేట్ చేసుకోవచ్చు.