నవతెలంగాణ – సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శుక్రవారం వినాయక మండపాల్లో పూజలు చేశారు. దీంట్లో భాగంగా సిరిసిల్లలోని వెంకట్రావు నగర్ లో గల శ్రీ సాయి గణేష్ ఉత్సవ సమితి మండపానికి చేరుకొని ఆయన ప్రత్యేక పూజలు చేశారు. మండప నిర్వాహకులు ఆది శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు. ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి ని సన్మానించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య సిరిసిల్ల పట్టణ అడహాక్ కమిటీ కన్వీనర్ అగ్గి రాములు కౌన్సిలర్ కల్లూరి రాజు రెడ్డి నాయక్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ గడ్డం నరసయ్య సంగీతం శ్రీనివాస్ గుడ్ల పెళ్లి గౌతమ్ రాపెళ్లి నరేందర్ గాజుల ఉమాకాంత్ గాజుల మల్లేశం శ్రీరాముల వెంకటేశం తోట శంకర్ గాలి ఆంజనేయులు పోలు శంకర్ నాయిని మాధవరావు జూపల్లి శ్రీనాథ్ రావు ఎర్రబెల్లి రమణారావు పంబాల దేవరాజు భక్తులు పాల్గొన్నారు.