బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుంది: ఆది శ్రీనివాస్

– ముంపు గ్రామాల ప్రజలకు 5లక్షల 4వేయిలు ఇస్తాం..
– ఉపాధి పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం..
– బండి సంజయ్ రాజన్న గుడికి ఎన్ని నిధులు తెచ్చావు..
నవతెలంగాణ – వేములవాడ 
మూడో సారి బీజేపి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు రిజర్వేషన్లను రద్దు చేస్తుంది..బిజేపి వారు దేశంలో నిరుద్యోగం పెరిగేలా చేశారు, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారు.. నిత్యవసర ధరలు పెంచి పేదవారి నడ్డి విరిచారు అని అన్నారు. ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే  ఆది శ్రీనివాస్ గురువారం వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం, సంకెపల్లి గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. మే 13 న జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో రాజేందర్ రావు అత్యధిక మెజారిటీతో గెలిపించాలి గ్రామస్తులను కోరారు.నాలుగున్నర మాసాల క్రితం బీఆర్ఎస్  పక్కన పెట్టినట్లుగా బిజెపిని కూడా పక్కన పెట్టాలి. రాజన్న సాక్షిగా ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పారుఅని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రలో బిఆర్ఎస్ పని అయిపోయింది, పది సంవత్సరాలు అధికారంలో ఉండి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా ప్రజలను పట్టించుకోలేదు అని మండిపడ్డారు.బండి సంజయ్ రాజన్నకు ఆణ పైసా అయిన తెచ్చావా, ప్రసాదం పథకం ద్వారా రాజన్న కు ఎన్ని నిధులు తెచ్చావు అని ప్రశ్నించారు. బిజేపి వారు దేశంలో నిరుద్యోగం పెరిగేలా చేశారు, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారు.. నిత్యవసర ధరలు పెంచి పేదవారి నడ్డి విరిచారు అని విమర్శించారు.దేశంలో 400 సీట్లు ఇవ్వాలని బీజేపి వారు అడుగుతున్నారు,మూడో సారి బీజేపి అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ లకు రిజర్వేషన్లను రద్దు చేస్తుంది అని తెలిపారు.
మీఓట్లుతో గెలిచిన బండి సంజయ్ ముంపు గ్రామాల ఎప్పడూ అయిన వచ్చావా,ముంపు గ్రామాల సమస్యల పై బండి సంజయ్ కు చిత్త శుద్ధి లేదు.ఎన్నికలప్పుడు వచ్చే వారు కాదు ఎన్నికలు ఉన్న లేకున్న వచ్చే వారిని ఆశీర్వదించండి అని కోరారు.ముంపు గ్రామాల సమస్యలు పై మి గళం లో గలమెత్త, మీ పాదంలో పాదం కలిపిన వాడిగా మీ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు.మన సమస్యలు ముఖ్యమంత్రికి తెలుసు త్వరలోనే వాటికి పరిష్కారం కృషి చేస్తానని,ముంపు గ్రామాల ప్రజలకు 5లక్షల 4వేయిలు ఇస్తాం ముంపు గ్రామాల సమస్యల పై వెనక్కి పోయే ప్రశ్నే లేదు ఉపాధి పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం అని వెల్లడించారు.మత్స్యకారులకు ఫిషరిష కల్చర్ ద్వారా ఉపాధి కల్పిస్తున్నాం, అణుపురం లో కుట్టు మిషన్ శిక్షణ ఇస్తున్నాం .. మిలెట్ల తయారీ ద్వార ఉపాధి కల్పిస్తున్నాం అని అన్నారు.బీజేపి, బిఆర్ఏస్ ప్రజలను మోసం చేసింది, పేదల గురించి ఆలోచించేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశంలో పెదల కష్టాలు తెలుసుకోవడం కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు అని తెలిపారు. పాంచ్ న్యాయ పేరిట సంక్షేమ పథకాలను అమలు చేస్తాం పని హామీ ఇచ్చారు. అయోధ్య రామాలయం పూర్తి కాక ముందే ఓట్ల కోసం అక్షింతలను పంచారు.రాజేందర్ రావు కు ఒక్క అవకాసం ఇవ్వాలి..జోడేద్దుల్లాగా పనిచేస్తాం..మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తు పైవే సి రాజేందర్ రావును భారీ మెజారిటీతో గెలించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మండలాధ్యక్షుడు పిల్లి కనకయ్య, కాంగ్రెస్ నాయకులు తో పాటు తదితరులు పాల్గొన్నారు.