ఆదిపర్వం రిలీజ్‌కి రెడీ

Aadiparvam is ready for releaseరావుల వెంకటేశ్వర్‌ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్‌ పతాకంపై ఏఐ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కలయికలో నిర్మించిన చిత్రం ‘ఆదిపర్వం’. ఈ సినిమాలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మరో కీలక పాత్రను ఆదిత్యం ఓం పోషిస్తున్నారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్‌ ప్రేమకథతో గ్రాఫిక్స్‌ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సంజీవ్‌ మేగోటి. ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 31న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ కు రాబోతోంది. మంచు లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆమె క్యారెక్టర్‌ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ క్యారెక్టర్‌ ఫస్ట్‌ లుక్‌ ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుంటోంది. ఇప్పటిదాకా మంచు లక్ష్మి చేయని, ఓ సరికొత్త పాత్రలో ప్రేక్షకులను అలరించబోతున్నారు. దర్శకుడు సంజీవ్‌ మేగోటి మాట్లాడుతూ, ‘అన్వికా ఆర్ట్స్‌, ఏఐ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సహకారంతో నేను అనుకున్న స్థాయిలో ఒక గొప్ప చిత్రంగా మలిచానన్న సంతప్తి ఉంది. మంచు లక్ష్మి, ఆదిత్యం ఓం, శివ కంఠమనినేని, ఎస్తేర్‌ పాత్రలకు జనం నీరాజనం పలుకుతారు. 1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ ఘటనల సమాహారంగా ఈ సినిమాను రూపొందించాను. అమ్మోరు, అరుంధతి చిత్రాల తరహాలో దుష్టశక్తికి, దైవశక్తికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. మా మూవీలో గ్రాఫిక్స్‌ హైలైట్‌ అవుతాయి’ అని తెలిపారు.